| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| ఆశ్వాసాంత పద్యగద్యములు | ||
| శా. |
వ్యాయామ స్థిరసంధిబంధ! కటకాధ్యక్షానుగక్షోణి భృ త్కాయ గ్రావభిదా విధా భిదురదోఃఖడ్గాగ్ర! యుగ్రాచల జ్యాయః కీర్తి భర ప్రంచ! వరపంచారామ రామామణీ గేయామేయజయాంక! పంకజదృగంగీకార ధీరాకృతీ! |
124 |
| క. |
కాంతా లతాంతశర! యే కాంతిక భక్తి ప్రతోషితాంభోధిసుతా కాంతా! ప్రతాప రవిశశి కాంతాయిత విమతనృపతి కాంతాహృదయా! |
125 |
| వన మయూరము. |
రాజపరమేశ! ఫణిరాజబల! ఫుల్లాం భోజముఖ! భోజముఖ భూప! విపులాంసో త్తేజిత ధరాభరణ దీక్షితభుజా! ని ర్వ్యాజభయదాజి విజితారి నృపరాజీ! |
126 |
| గద్యము. |
ఇది శ్రీ మదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోప తాపస ప్రసాదసమాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసానిచొక్కయామాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా ప్రబంధంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము. |
|