| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| నారదునకు రుక్మిణీ కృష్ణుల యాతిథ్యము | ||
| క. |
వచ్చిన మునిపతి కెదురుగ వచ్చి, నమస్కృతు లొనర్చి, వనితయుఁ దానుం బొచ్చెంబులేని భక్తి వి యచ్చర రిపు భేది సలిపె నాతిథ్యంబున్ |
45 |
| తే. |
అపుడు రుక్మిణి కనుసన్న నబ్జముఖులు రత్న సింహాసనంబు నారదున కిడిరి, హరియు నమ్మౌని యనుమతి నర్హ పీఠ మున సుఖాసీనుఁడై కరంబులు మొగిడ్చి |
46 |
| క. |
సురసంయమివర! మీరిట కరుదేరఁగ నిప్పుడేఁ గృతార్థుఁడ నయితిన్ నిరతంబు మీరు నాపయిఁ గరుణ గలిగి యునికి యిది యకారణము సుఁడీ |
47 |
| క. |
నావుడు శౌరికి నిట్లను నా వేలుపుఁ దపసి "మర్త్యుఁ డాడెడి రీతిన్ నీవిట్లు పలుక నుచితమె! యే విశ్వజనీన చరిత! యెఱుఁగనె నిన్నున్! |
48 |