| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| పారిజాత వృక్షమునే తెచ్చియిచ్చెదనని కృష్ణుని ప్రతిన | ||
| ఉ. |
ఓలలితేంద్రనీల శకలోపమ కైశిక! యింత వంత నీ కేల లతాంతమాత్రమున కేఁ గలుగ న్విను; నీకు దేవతా కేళి వనంబు సొచ్చి, యనికి న్బలసూదనుఁడెత్తి వచ్చినన్ డీలు పడంగఁ దోలి, యిటఁ దెచ్చెద నిచ్చెదఁ బారిజాతమున్ |
135 |
| తే. |
వామలోచన నీ కేలి వనములోన చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన సరస కర్పూర కదళికా తరుల నడుమ పెరటి జెట్టుగ నాటింతు పెంపు గనుమ |
136 |