| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| ఇంద్రోపేంద్రుల భీషణ సమరము | ||
| క. |
మురహర బలహరు లి ట్లొం డొరు తూపులఁ గప్పఁ బడుట నొదవించిరి త మ్మిరువురఁ గనుఁగొనఁ దివిరెడు గరు డోరగ ముఖుల కోరికకు విఘ్నంబుల్. |
24 |
| చ. |
అలుఁగుల దట్టమై పొడము నగ్నికణంబులు సోఁకి పైగఱుల్ వొలిసియుఁ దొంటివేగ ముడివోక క్రమంబున నొండొకంటిఁ బిం జలుగొని త్రోచికొంచు శరసంఘము లక్ష్యముదాఁకు విస్మితా ఖిల సుర సిద్ధ సాధ్యముగఁ గృష్ణుఁడు జిష్ణుఁడు బోరనయ్యెడ\న్. |
25 |
| తే. |
ఘోరముగ మింటఁ బందిరి గొని జగంబు నంధముగఁజేయు నిరువుర యంపగములు నొండొకటి దాఁకి క్రొమ్మంట లొదవి తామ చూర్ణమై పోవ ముదమయ్యెఁ జూపఱకును. |
26 |
| క. |
అలనాఁటి నన్ను మఱచితె! నిలు నిలుమీ తగినయాజ్ఞ నీ కిదె! యంచుం బులుఁగులఱేని సురేంద్రుం డలుఁగుల పెనుగూఁటఁ జిక్కునట్టుగ నేసె\న్. |
27 |
| మ. |
అలుకం గంసవిభేధి నందకముచే నయ్యస్త్రము ల్ద్రుంచి వే బలుతూపు ల్దృఢముష్టిఁ గూర్చి బలభి ద్భద్రేభ కుంభంబు వ్ర క్కలుగా నేసిన బోరునం దొరఁగె ముక్తాశ్రేణి, పైపై హిమా చల శృంగావతర న్నభశ్చర ధునీ చంచత్ప్రవాహాకృతి\న్. |
28 |