| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కావవే కమలాక్షి అంబ |
| జగన్మోహిని - ఆది | |
| పల్లవి: | |
| కావవే కమలాక్షి అంబ కామిత ఫలదాయకీ నన్ను | ॥కావవే॥ |
| అనుపల్లవి: | |
| భావ మలర నీ పదవనజములే బట్టి వేడితిని పావని శంకరి | ॥కావవే॥ |
| చరణము(లు): | |
| దీనులయెడ నీ వనయముజూపిన ఘనమగు కరుణ నే గావలెనంటిగా తనయుని భవజలధి దాటింపను కనికరమిడవే గౌరి రాఘవుని | ॥కావవే॥ |