| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | భజింపలేదని మదిలో నను |
| కేదార - ఆది | |
| పల్లవి: | |
| భజింపలేదని మదిలో నను త్యజింపకే నటరాజాంతరంగిణి | ॥భజింప॥ |
| అనుపల్లవి: | |
| అజాదిసురమౌనిజోత్తముల వలె నిజాంతరంగముతో నీ మూర్తిని | ॥భజింప॥ |
| చరణము(లు): | |
| హీనమగు భవకాననమున తుది గాననగు సుజ్ఞాన మొసగు దేవీ గానసుధాకరి భవహరి శంకరి గానమెరిగి రాఘవుడు సుస్వరముతో | ॥భజింప॥ |