| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నాయెడ మంచితనము లేక ని |
| కల్యాణి - ఆది | |
| పల్లవి: | |
| నాయెడ మంచితనము లేక ని న్నాడుకొనగ ఫలమా నతార్తిభంజని | ॥నాయెడ॥ |
| అనుపల్లవి: | |
| మాయాతీత స్వరూపిణి జనని కా మాదుల వశమై ఘడియ ఘడియకు | ॥నాయెడ॥ |
| చరణము(లు): | |
| పరమైన గంగాస్నాన మాడితిన - వలచి సుజ్ఞానుల వచన మాలించితిన నిరపరాధముగ నిను సేవింప - నేరని నీచుల చెలిమిని గోరి మారవైరిమనోహరి సుకు - మారి సుందరి మహిత కల్యాణి ఘోరపామరత్వమును బాపి నా - కోర్కెలొసగు రాఘవాఘమోచని | ॥నాయెడ॥ |