| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కలవారినమ్మి మది - కలతచెందగ నేల |
| ఆరభి - ఝంపె | |
| పల్లవి: | |
| కలవారినమ్మి మది - కలతచెందగ నేల కామితార్థము లొసగు - కల్పవల్లివి నీవుండగ అంబ | ॥కలవారి॥ |
| అనుపల్లవి: | |
| కలకాల మతిఘోర - కర్మబద్ధులై జగతి కలిమి గల్గుట నీదు - కరుణఫలమని తెలియక కలినింగిత మెరుగని - మానవు లాడెడి మా టలువిని కరుణమాలి - కఠినోక్తులు ఘనమని నన్నలయబలికి ఋణ - పడి భువిబ్రతికెడి సిరి | ॥కలవారి॥ |
| చరణము(లు): | |
| నిత్యమని భ్రమసి కడు - నీచులై మురిసేరు సత్యము గనలేక మద - మత్తులై నన్నాడేరు నిత్యానిత్య వివేక - నేర్పరులుగాక మది భృత్యుడగు రాఘవుని - బూని వంచనచేసెడి లోభము | ॥కలవారి॥ |