| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నేడే నిను సేవింపవలె గాని |
| ఆనందభైరవి - మిశ్రచాపు | |
| పల్లవి: | |
| నేడే నిను సేవింపవలె గాని నిత్యముగా యీ తనువు నిలువనేర్చునే | ॥నేడే॥ |
| అనుపల్లవి: | |
| వడిగా కామక్రోధములచే బెనగొని కడకు కాలునిబారి కడగండ్లుబడ మేలే | ॥నేడే॥ |
| ముక్తాయి స్వరము: | |
| . . . . | |
| చరణము(లు): | |
| అరిషడ్వర్గము నణచి అన్నిట నీవై వెలిగే అంతర్భావము దెలిసి పరమ దయానిధి నీ పదములే గతియని దురితహారిణి రాఘవుని దుడుకుదీర | ॥నేడే॥ |