| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సుమశరహరవర సుదతీ పార్వతి |
| ఆభోగి - ఆది | |
| పల్లవి: | |
| సుమశరహరవర సుదతీ పార్వతి సులభముగా భవజలధి దాటింపవే | ॥సుమ॥ |
| అనుపల్లవి: | |
| కమలేక్షణ ధనదారసుతులపై మమతవీడి నిన్నే మరిమరి వేడితి | ॥సుమ॥ |
| చరణము(లు): | |
| ఆగమ విధియుత స్వాగతమొసగి రాగరహితుడై రంజిల్ల పూజించి రాగతాళస్వర రక్తిభక్తిజ్ఞాన యోగముచే నిను వేడు రాఘవు నీవేళ | ॥సుమ॥ |