| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఈ నాడెవరితో మొరలిడుదు |
| తోడి - ఆది | |
| పల్లవి: | |
| ఈ నాడెవరితో మొరలిడుదు ఇందుముఖి త్రిపురసుందరి యిక | ॥ఈ॥ |
| అనుపల్లవి: | |
| ఆనాటి మొదలు నీ పదయుగ మాశ్రయించియున్న నా శ్రమ దీర్పవు | ॥ఈ॥ |
| చరణము(లు): | |
| కొదువలేక ఎల్లవేళల తోడై న న్నాదుకొందువని అంతరంగమున పదము వీడ రాఘవుని నిజభక్తి విధమెరిగి బ్రోచు వితరణ లేకుంటే | ॥ఈ॥ |