| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | తరుణమిదే శివ తరుణీమణి |
| మోహన - ఆది | |
| పల్లవి: | |
| తరుణమిదే శివ తరుణీమణి తనవాడని బ్రోచుటకు నీకు మంచి | ॥తరుణ॥ |
| అనుపల్లవి: | |
| కరుణాకరి స్మరజనక సహోదరి నీ మరుగు జేరితి ధర్మార్థకామమోక్షదాయిని | ॥తరుణ॥ |
| చరణము(లు): | |
| భక్తజన ఘనవిపత్తు లణచు పరాశక్తి చాముండేశ్వరి గుహజననీ రిక్తుని ఘోరభవాబ్ధి దాటుట క శక్తుని వరివస్యాసక్తుని రాఘవుని బ్రోచు | ॥తరుణ॥ |