| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | హారతి జేకొనవే అంబా జయ |
| సురట - ఆది | |
| పల్లవి: | |
| హారతి జేకొనవే అంబా జయ | ॥హారతి॥ |
| అనుపల్లవి: | |
| మారవైరి ప్రియ - మానినీ నీదు కు మారుడ నే అభి - మానముజూపి కర్పుర | ॥హారతి॥ |
| చరణము(లు): | |
| నవమణిమయ సిం - హాసనమున కొలువై నతపాలన మొన - రించు సనాతనీ పావనమగు నీ - నామ భజన లోక పావనమే గదా - భవహరి రాఘవుని | ॥హారతి॥ |