| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఒంటరిగా విదేశముల కనుపక నా |
| వాచస్పతి - ఖండజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| ఒంటరిగా విదేశముల కనుపక నా వెంటరావలెనమ్మ ముక్కంటి నీబంటు | ॥నొంటరిగా॥ |
| అనుపల్లవి: | |
| కంటిరెప్పకైవడి నాదు వెను వెంట నిలచి దుర్ఘటసంకటముల దీర్పవలె | ॥నొంటరిగా॥ |
| చరణము(లు): | |
| నిజదార సుతోదర పోషణ కేప్రొద్దు నిన్ను మరచి పోనాడ కనిశము జగతిని భజన సుగతినిడు పథమని యెంచిన తనకు విజయములిడి ఎల్లవేళల రాఘవుని కృపజూడక | ॥నొంటరిగా॥ |