| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కులమేదైతె నేమిరా తన |
| మందార - ఆది | |
| పల్లవి: | |
| కులమేదైతె నేమిరా తన తొల్లిజన్మార్జిత కర్మఫలజమగు | ॥కుల॥ |
| అనుపల్లవి: | |
| జలజాసనహరిహరులను గన్న తల్లి పరాశక్తిని దలచి ధన్యుడౌటకు | ॥కుల॥ |
| చరణము(లు): | |
| ధర ప్రథితాత్మకమగు భరతావని పరగు గుణకర్మభాగ వశముచే నరుడు నాల్గువర్ణముల జనించు వి వరమెరిగిన రాఘవ వినుతున కిక | ॥కుల॥ |