| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కాదనేరు జననీ కలినరులు |
| భైరవి - ఆది | |
| పల్లవి: | |
| కాదనేరు జననీ కలినరులు కార్యకారణకర్త్రివై వెలిగే నిను | ॥కాదనేరు॥ |
| అనుపల్లవి: | |
| పాదయుగపశువులై ధర బుట్టిన పాపమునకు సంతాపము జెందక | ॥కాదనేరు॥ |
| చరణము(లు): | |
| నిత్యమై నిగమాంత పరతత్వమై సత్యాఖండ సమాధినెగడు నిన్ను కృత్యాకృత్యవివేకవిహీనులెటు గుర్తింతురు రాఘవునితో కుతర్కించి | ॥కాదనేరు॥ |