| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | హరనారీ నామాక్షరరుచి యే |
| మధ్యమావతి - ఆది | |
| పల్లవి: | |
| హరనారీ నామాక్షరరుచి యే నరునికి దొరకునో మనసా స్మర | ॥హర॥ |
| అనుపల్లవి: | |
| సురకిన్నరకింపురుష భూ సురమానసమున కగోచరమౌ | ॥హర॥ |
| చరణము(లు): | |
| పులకాంకితుడై పూని వివిధ సుమ ముల పూజించి భువనేశ్వరి సన్నిధి కలకాల మెడతెగని భక్తి భూ తలమునజేయు రాఘవనుతునికే గాక | ॥హర॥ |