| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | రాజరాజేశ్వరి నీపద |
| మోహన - ఆది | |
| పల్లవి: | |
| రాజరాజేశ్వరి నీపద రాజీవములె నమ్మితినమ్మ నట | ॥రాజ॥ |
| అనుపల్లవి: | |
| ఈ జగాన దయానిధియని పేరై తేజరిల్లు జగదేకజనని శ్రీ | ॥రాజ॥ |
| చరణము(లు): | |
| భావజరిపు హరి విధి సురపతులెల్ల సేవింపగ మందహాసముతో కొలువై ఈ వసుధ ధర్మపాలనజేయు పావనమూర్తి భక్త రాఘవపాలిని శ్రీ | ॥రాజ॥ |