| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కాలవికృతమున పాలబడు కష్ట |
| వరాళి - ఆది | |
| పల్లవి: | |
| కాలవికృతమున పాలబడు కష్ట జాలములకు భయమేలనే మనస | ॥కాల॥ |
| అనుపల్లవి: | |
| జాలిదీర్చి భక్తపాలనజేయు ఫాలనేత్రి మనపాల గల్గియుండ | ॥కాల॥ |
| చరణము(లు): | |
| దారసుతులతో గూడిన యీ సం సారమున సుఖవిచారములేప్రొద్దు వేరుగాక ఆమరణము నరునికి చేరువై నెగడు రాఘవాఘఫల | ॥కాల॥ |