| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | తల్లీ సదా నీపద |
| మణిరంగు - ఆది | |
| పల్లవి: | |
| తల్లీ సదా నీపద పల్లవములె కదా నమ్మినారము | ॥తల్లీ॥ |
| అనుపల్లవి: | |
| ఉల్లాసమెంతో గల నా ఉల్లము రంజిల్ల పూజించి | ॥తల్లీ॥ |
| చరణము(లు): | |
| ఎన్ని జన్మలకైనా తుదకు నీ సన్నిధిజేరు సౌభాగ్యమె ఉన్నతమని యెంచి యుప్పొంగుచు అన్నివేళల ఆజన్మముకోరి యున్న రాఘవుని కోర్కె లాలించి బ్రోచు | ॥తల్లీ॥ |