| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శంకర కోమలి శరణుజొచ్చితి నీ పద |
| దర్బారు - ఆది | |
| పల్లవి: | |
| శంకర కోమలి శరణుజొచ్చితి నీ పద పంకజములె నమ్మి భవభయహారి శివ | ॥శంకర॥ |
| అనుపల్లవి: | |
| సంకటముల దీర్చి సద్భక్తి గూర్చి నా వంకజూచి బ్రోతువని వరదాయకి శివ | ॥శంకర॥ |
| చరణము(లు): | |
| సరసామృత దుఘవీక్షణముచే నన్ను పారజూచి పరిపాలింతువని స్మరజనక సోదరీ చిరకాలముగా చేరి నీ సన్నిధిని రాఘవనుత | ॥శంకర॥ |