| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నీకే దయరాదా జననీ నాపై |
| చక్రవాక - ఆది | |
| పల్లవి: | |
| నీకే దయరాదా జననీ నాపై నేరములెల్ల సైరించి బ్రోచుటకు | ॥నీకే॥ |
| అనుపల్లవి: | |
| రాకేందుముఖి సదాశివరాణివై రాజిల్లుచూ త్రిభువనరక్షణివైన | ॥నీకే॥ |
| చరణము(లు): | |
| భారమైన భవబాధలణచి కడ తేర జూచి కరుణించుట కెవరే మారజనకసోదరి శంకరి నను చేర బిలిచి నీకుమారునిగా జూడ | ॥నీకే॥ |
| ఏవేళను నాకీవే గతియని భావించి నీ పదభక్తి జేసెద రావే దీనరక్షకి రాఘవుని సేవలందుకొని బ్రోవను మదిలో | ॥నీకే॥ |