| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నామసుమార్చన జేతు సదాశివ |
| మాయామాళవగౌళ - ఆది | |
| పల్లవి: | |
| నామసుమార్చన జేతు సదాశివ నాయకి నీచరణాంబుజములకు శత | ॥నామ॥ |
| అనుపల్లవి: | |
| కోమలగాత్రి కుమారజననీ వామిని కామేశ్వరి వరదాయకియని | ॥నామ॥ |
| చరణము(లు): | |
| తులసీ బిల్వ చామంతి పున్నాగ మల్లి మరువ కరవీర కమలములచే ఉల్లము రంజిల్ల ఎల్లవేళల పల్లవపాణి భవానీ రాఘవుని యనంత | ॥నామ॥ |