| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | వలసినదేమీ జననీ మాకీ |
| రీతిగౌళ - ఖండత్రిపుట | |
| పల్లవి: | |
| వలసినదేమీ జననీ మాకీ వసుధ నీదు పదవనజ భక్తికన్న గా | ॥వలసిన॥ |
| అనుపల్లవి: | |
| పలువిధముల భవబాధలణచి బ్రోచె శివ భామినివై మాపాల గల్గియుండగా | ॥వలసిన॥ |
| చరణము(లు): | |
| ఆనాడె కడు చిరుప్రాయమున రాఘవుని శ్రీనాథానంద సద్గురు లతి కృపతో నీనామ జపవిధి నిధులను బోధించి జ్ఞానానంద పరతత్వాయత్త చిత్తుని జేసె | ॥వలసిన॥ |