| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | మనసా సదాశివ మానిని |
| సురట - ఆది | |
| పల్లవి: | |
| మనసా సదాశివ మానిని నామాక్షరము లేమరక భజింపవే ఓ | ॥మనసా॥ |
| అనుపల్లవి: | |
| వనజాసన హరిహర సురపతులెల్ల నెనరున త్రిభువనాధీశ్వరి యని పొగడిరి | ॥మనసా॥ |
| చరణము(లు): | |
| పలు జనన మరణ బాధ లణచి ఇహ పర సుఖము లిడి పరిపాలించునట ఇల ఈ నరజన్మ మబ్బి యున్నపుడె స ఫలముగ జేయవె జ్ఞానానంద తీర్థుని | ॥మనసా॥ |