| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | దేవీ కామాక్షీ పర |
| మాయామాళవగౌళ - ఆది | |
| పల్లవి: | |
| దేవీ కామాక్షీ పర శివదేహార్ధదాయినీ నన్ను బ్రోవవే | ॥దేవీ॥ |
| అనుపల్లవి: | |
| నీవే త్రిభువనాధీశ్వరి యని పొగడి దేవేంద్రాది సురభూసురులెల్ల సేవింపరె | ॥దేవీ॥ |
| చరణము(లు): | |
| చిరకాలముగ నీ చరణాంబుజము లే మర కారాధింపుచు మదివేడితి జననీ శరదిందుముఖి కాంచీపురాధీశ్వరీ ధర నిరుపమ జ్ఞానానంద తీర్థార్చిత | ॥దేవీ॥ |