| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు |
| పూర్వికల్యాణి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు నిఖిలలోకజనని నన్ను బ్రోచుటకు॥ |
| అను పల్లవి: |
| పన్నగభూషణుడైన కాంచి ఏకామ్ర పతిమనోహారిణి శ్రీ కామాక్షి॥ |
| చరణము(లు): |
| పరమలోభులను పొగడి పొగడి అతి పామరుడై తిరిగి తిరిగి వేసారి స్థిరములేకనతి చపలుడైతి నా చింతదీర్చి వేగమే బ్రోచుటకు॥ |
| ఇలలో నీవలే గాదా నీ మహిమ ఎంతని యోచింప ఎవ్వరి తరమా పలుక వశమా ఆది శేషునికైనను పతితపావని నన్ను బ్రోచుటకు॥ |
| తామసంబిటుల సేయరాదికను తల్లి నా మొఱ వినరాదా దయలేదా కామితార్థ ఫలదాయకి నీవే గదా శ్యామకృష్ణ సహోదరి బ్రోచుటకు॥ |