| కీర్తనలు | శ్యామా శాస్త్రి | హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే |
| కల్యాణి - రూపక |
| పల్లవి: |
| హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే॥ |
| అను పల్లవి: |
| సుమేరుమధ్య వాసిని శ్రీ కామాక్షి॥ |
| చరణము(లు): |
| హేమగాత్రి పంకజనేత్రి మతంగాత్మజే సరోజభవ హరీశ సుర మునీంద్రనుతే॥ |
| అంబుజారి నిభవదనే మౌక్తికమణి హారశోభమాన గళే భక్త కల్ప లతే॥ |
| శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరి జాల నీలవేణి కీరవాణి శ్రీ లలితే॥ |