| కీర్తనలు | శ్యామా శాస్త్రి | ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు |
| తోడి - ఆది |
| పల్లవి: |
| ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు॥ |
| అను పల్లవి: |
| సామజగమనా ధర్మసంవర్ద్ధనీ అంబా సురులకు నీ మాయ తెలియలేరు శాంభవీ నీమహాత్మ్యమతిశయము॥ |
| చరణము(లు): |
| నీరజలోచనా లోకములో నిను హృదయములో నిలుపిన లోకులు ధన్యులైరిగా నలుగురిలో సారమతీ నను దయతో గాంచి కరుణించుము తల్లి నెఱ నమ్మితి చాలా మహాలీల గలిగిన శక్తి సంతతము నీవే సంతోష వతి॥ |
| ఓ జనని కరుణి భవప్రియా వినుమవని ఓమ్ అనిన జన్మసాఫల్యమాయే నీదు కథలను విని ఓ మోహావృతలైయున్న జనులను తల్లి ఇపుడు బ్రోవుము ఓ రాజాధిరాజేంద్రమణి మకుట పటలి మణి విరచితపదా॥ |
| కంజనదాంతుని కామితాశుభచరితా ప్రసన్నవదనా ఘన కృపాసహితా శ్యామకృష్ణ చింతా గిరితనయా పంచనద కావేరి తీరమున నివసించే ఉమా పంచాపకేశముని నుతా హైమవతీ పరాశక్తీ॥ |