| కీర్తనలు | దాసు శ్రీరాములు | ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనే |
| సావేరి - రూపకం | |
| పల్లవి: | |
| ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనే రంజిల్లు వాని గుణము - రమణి మన మెరుగమే | ॥ముంజేతి॥ |
| చరణ: | |
| కమ్మదనపు మాటలనె - కడుపులోనొక విధమె కొమ్మవాని వలపు ని - క్కమ్ముగాదె నమ్మరాదె | ॥ముంజేతి॥ |
| మాటలును చేతలును - మనవద్దనే చెలియ మాటికి పడకలా - మగువతోడ తగవదేడ | ॥ముంజేతి॥ |
| భాసురాంగి నన్నుమాయ - జేసె నేనేమి సేతు దాసురామకవి మనోని - వాసుడాయె మోసమాయె | ॥ముంజేతి॥ |