| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 9 (తొమ్మిదవ రోజు) - పాహి పర్వతనన్దిని మామయి |
| ఆరభి - ఆది |
| పల్లవి: |
| పాహి పర్వతనన్దిని మామయి పార్వణేన్దుసమవదనే |
| అనుపల్లవి: |
| వాహినీతటనివాసిని కేసరి- వాహనే దితిజాళివిదారణే |
| చరణము(లు): |
| జంభవైరిముఖనతే కరి- కుమ్భపీవరకుచవినతే వర- శంభులలాటవిలోచనపావక- సమ్భవే సమధికగుణవసతే ॥1॥ |
| కఞ్జదళనిభలోచనే మధు- మఞ్జుతరమృదుభాషణే మద- కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ- భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥ |
| చఞ్చదళిలలితాళకే తిల- కాఞ్చితశశిధరకలాళికే నత- వఞ్చినృపాలకవంశశుభోధయ- సఞ్చయైకకృతిసతతగుణనికే ॥3॥ |