| కీర్తనలు | తూము నరసింహదాసు | ఏమఱకుమీ మనసా - శ్రీరాముని - |
| రేగుప్తి - ఆది |
| పల్లవి: |
| ఏమఱకుమీ మనసా - శ్రీరాముని - ఏమఱకుమీ మనసా |
| చరణము(లు): |
| ఏమఱకుమీ రఘు - రాముని శ్రీపద తామరసంబులు దలచుచు సతతము |
| రాముని సుగుణోద్దాముని భయదవి రాముని జగదభిరాముని నిమిషము |
| కాలునిదూతలు గ్రమ్మువేళ నిను గడతేర్చుటకు గతి యగు నామము |
| సూరిజనుల కాధారు లగుచు భువి చారుతరంబగు తారకనామము |
| దేవదేవుడన తేజరిల్లి కడు పావనుఁడగు శ్రీభద్రగిరీశుని |
| శ్రీకరముగ నరసింహదాసుని జేకొని బ్రోచెడు శ్రీకరు నెద గని |