కీర్తనలు తూము నరసింహదాసు కావేటిరంగా నను కానవేరా
యమునాకల్యాణి (సింధుభైరవి) - ఏక
పల్లవి:
కావేటిరంగా నను కానవేరా
అనుపల్లవి:
కావేటిరంగ నను గావుమనుచు వేడ
రావేమి సేతురా రాకుమారా
చరణము(లు):
కోమలాంగులెల్ల చామరలిడుచుండ
నా మొరాలింపవో కామజనకా
సేవకుఁడను నన్నుఁ జేకొనుమంటి నిక
నీవే గతియంటి - నీరజాక్ష
పాతకుఁడ నటంచుఁ బట్టు వీడెదవు నీ
చేత గాకున్ననేమి - సేతునో హరీ
జాల మేల నే నీపాలిటివాఁడ భక్త
పాలనలోల కృప నేలుకోర
కోరికతోడ తూము నారసింహదాసుని
జేరి రక్షింపవే మురారిశౌరి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - kaaveeTiraMgaa nanu kaanaveeraa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )