కీర్తనలు తూము నరసింహదాసు రంగని సేవింపఁ గలిగెనమ్మ - వయ్యారి మోహన

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

రేగుప్తి (మోహన) - ఆది
పల్లవి:
రంగని సేవింపఁ గలిగెనమ్మ - వయ్యారి మోహన
చరణము(లు):
అంగన లిరువురు రంగుగఁ బదములు
పొంగుచునొత్త భుజంగ శయనుఁడగు
తీరుగ నుభయకావేరి మధ్యమున
మీరుచుఁ బ్రణవాకారుఁడైన శ్రీ
నాభికమలముల నవినజు నిడుకొని
స్వాభిమానమున జగములనేలెడు
ఉరమునందు సిరి మెఱయుచుండఁగను
శరణను భక్తులఁ గనుగొనుచుండెడు
చారుసప్తప్రాకార సువర్ణ హ
జారమునందు విహారకుడై శ్రీ
దోరి తూము నరసింహదాసునకు
గూరిమితో భవతారకుడైన శ్రీ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raMgani seeviMpa.r galigenamma - vayyaari moohana - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )