| కీర్తనలు | తూము నరసింహదాసు | నేడుగదా నా జన్మ సఫలముగ - నిన్ను జూడగంటి |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| నేడుగదా నా జన్మ సఫలముగ - నిన్ను జూడగంటి నీడజవాహ విహారా నే - నీవాడను వీడను ఓడననుటచే |
| చరణము(లు): |
| ఎంద రెన్ని దెల్పిన వినకను నీ - సుందర మగు మూర్తి పొందుగ నామది డిందుగొల్పి భవ - బంధము విడ నానందముతోడుత |
| భూసురులును ధర భూపతులును బహు వాసిగ గొల్వగను భాసురమగు సిం - హాసనమున నింపారుట గని సురభామిను లాడగనే |
| తీరుగఁ బెండ్లి కుమారుడై వరధారుణి నందనతోఁ జేరి మెఱపి తలంబ్రాలు పోయగను - కోరి జూడ మీవార మనుటచే |
| వరభద్రాచలపురమున సీతా - వరుడ వనగ వెలసి ధరణిలోన నీదాసులకును బహు - దాపయి ప్రాపయి దయ నేలుదువని |
| పరమదయాళుడవని మును విను నా - పలుకులు నిజముసుమీ వెఱవకుమని నీకరుణతోడ తూము - నరసింహ్వయు నను రమ్మనుటచే |