కీర్తనలు తూము నరసింహదాసు ఇందువదన కంటివే యీసభతీరు - యెందైన మును వింటిమే
కల్యాణి - త్రిపుట (ఆది)
పల్లవి:
ఇందువదన కంటివే యీసభతీరు - యెందైన మును వింటిమే
(దు) ఇందుశేఖరు డాదిగాగ పు - రందరాదులు గొల్వ ఖగరా
ట్స్యందనుం డిదె నారసింహుని మందిరంబున గొల్వుతీరెను
చరణము(లు):
వరుణపురముకన్న వాసవుసభకన్న వైభవమున నెక్కువై
(దు) సరసిజాక్షుని చర్య లెల్లను మెఱుపు జాంబునదపు గోడల
తరుచుగా లిఖియించిరి గురుతుగా మృదుపదములందున
శ్రీకరముగ రత్నసింహాసనమున చెలియ జానకితోడుత
(దు) ప్రాకటంబుగ దీనజనులకు బ్రాపు దాపై దివ్యవిగ్రహ
రూపు గన్పడఁ జేయుచుండెడి పాకశాసనవందితుని సభ
గానమునకుఁ జొక్క గంధర్వనాథులె ఘనత హెచ్చరికసేయ
(దు) దీనజన పెన్నిధానమనగను దేవరాయని హృదయమందున
మానుగ వేంచేసియుండెడు మాసమేతుని కొల్వుకూటము
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - iMduvadana kaMTivee yiisabhatiiru - yeMdaina munu viMTimee - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )