| కీర్తనలు | తూము నరసింహదాసు | సెలవా మాకు సెలవా |
| మధ్యమావతి - ఆట |
| పల్లవి: |
| సెలవా మాకు సెలవా |
| అనుపల్లవి: |
| సెలవా మాకిక జలజసంభవమతీ జలధర గాత్ర సజ్జన మునిస్తోత్ర |
| చరణము(లు): |
| సుందర వదనా సుందరలోల నంద నందన గోవింద సదానంద |
| వనజాతనేత్ర పావననామ రిపుభయ కనకచేల వరద వైకుంఠపురవాస |
| బుధజన వందిత పూజిత పదపద్మ మధుసూదనానంద మందరాచలధర |
| దుర్మదాంతక భక్త నిర్మలలోల ధర్మ సేవిత రామదాస విలాస |
| నగరాజోద్భవ నుత నగవైరి సన్నుత నిగమసేవిత భక్తనరసింహపూజిత |