కీర్తనలు తూము నరసింహదాసు దంతధావనముఁ దడయ కవధరింపుము దశరథ నృపనందనా, భక్తచందనా
ద్విజావంతీ (దర్బారు) - చాపు
పల్లవి:
దంతధావనముఁ దడయ కవధరింపుము దశరథ నృపనందనా, భక్తచందనా
దంతిరక్షక దాసపోషక దనుజాంతక శృంగారవంత శ్రీరామ
చరణము(లు):
పూషణుఁ డుదయించె పుణ్యపురుషులు సంతోషముతోడ నేడు
శేషశయన నీ విశేషము జూడగ
దోష రహితమని భాషింపు చున్నారు
అజభవామరులును నఖిలసన్మునివరులు నఖిలదిక్పాలు రెల్ల
భజనజేసి కృపబడయు కోరికతోడ
గజిబిజిగా నిన్ను గాచియున్నారదే
వాసిగ భద్రాద్రివాసా శ్రీనరసింహదాసపోషక రాఘవా
ఆసించియున్నాఁడ అనఘ నీ దర్శన
లేశముచే జన్మవాసన లడగునని
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - daMtadhaavanamu.r daDaya kavadhariMpumu dasharatha nR^ipanaMdanaa, bhaktachaMdanaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )