| కీర్తనలు | తూము నరసింహదాసు | రామ యిందాక యెందు బోయినావురా |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| యమునాకల్యాణి - ఆది |
| పల్లవి: |
| రామ యిందాక యెందు బోయినావురా |
| అనుపల్లవి: |
| ప్రేమమీర నాముందర యేమరుండ వైతివా కావు కావు |
| చరణము(లు): |
| మొలక నవ్వులమోమునఁ దిలకము మెఱయగ గులుకుచు ముద్దుల పలుకులు - నేను వినను |
| కుంకుమరసము దుప్పటి - కురుచవిల్లు చేతఁ బట్టి శంఖచక్ర ధారుడవై - పొంకముగా సొగసుమీరిన |
| బంగారు చెరగుల చీరలు - రంగుమీరగ దాలిచి యు ప్పొంగుచు భద్రాచలంబున - సంగతిగ మాసీతను గూడుక |
| చందురు గేరుమోమున శ్రమ - బిందు కణములూరగా మందహాసము మెఱయఁగా - ముని బృందము సన్నుతిసేయగా |
| శ్రీకరమైన మీపదములు - నరసింహదాసాహ్లాదములు ప్రాకటముగ భవహరములు - శ్రీభద్రశైలాభరణములు |