కీర్తనలు తూము నరసింహదాసు ఏమిర దశరథరామా నన్నేటికి రక్షించ విది నీకు ప్రేమా
నాటకురంజి - చాపు
పల్లవి:
ఏమిర దశరథరామా నన్నేటికి రక్షించ విది నీకు ప్రేమా
చరణము(లు):
పతితుడనని దెల్పుకొంటి
పతితపావన బిరుదు గలదంటి
అతి మోదమున నమ్మియుంటి నాకు
గతి నీవేయని నిన్ను బ్రతిమాలుకొంటి
కరుణ రాకున్న దిక్కెవ్వరు మోహ
పరవశుండను నన్ను బరులు చేకొనరు
గురి దెల్పువా రెవరు లేరు నీవు దరిగాక
ధరలో నెవ్వరు గానరారు
పరుల వేడితినా యేమైన భవ
పరవశమున భక్తవరుల దూరితినా
భవపాశమును జెందితినా భద్ర
గిరి వరేశుడ నిన్ను మరువదలచితినా
ద్రోహి యనుచు నెంచబోకు పక్షి
వాహన నీవాడ బరుల కివ్వకు
సాహసమున విడువబోకు భవ
మోహాదులను జెంది మోసపోనీకు
పర మంత్రమె జీవనమురా నీ
చరణసేవ మాకు పరమమంత్రమురా
ఆసలేక సేవ జేసితిరా తూము
నరసింహుడ టంచు మొఱబెట్టితినిర
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - eemira dasharatharaamaa nanneeTiki raxiMcha vidi niiku preemaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )