కీర్తనలు తూము నరసింహదాసు రామరామ యందునో అప్పుడు వట్టి పామరమున నుందునో
రేగుప్తి - ఆట
పల్లవి:
రామరామ యందునో అప్పుడు వట్టి పామరమున నుందునో
కాముకుడ వటంచు గాలుని దూతలు కరుణమాలి నన్ను గష్టబెట్టెడువేళ
చరణము(లు):
జపము లెఱుగనైతి ఎన్నడు నిష్ఠ తపము సేయనైతిని
కఫవాత పైత్యాది కర్మములను జెంది
యుపమ లేక బుద్ధియూహ దిరుగువేళ
తనువు స్థిరము గాదని బుద్ధిని మున్నె దలచుకొననైతిని
ఘనమయిన తారకమను వర్ణాక్షరముల
మహిమచేతను బుద్ధి మమత దొలఁగి శ్రీ
దాన మెఱుగనైతిని యెన్నడునొక్క ధర్మ మెఱుగనైతిని
మానాభిమానము ల్మచ్చరింపగ నాత్మ
గానను దూతల గనువేళనైన శ్రీ
మనసు నిల్పనైతిని రామునిసేవ మఱిగి యుండనైతిని
మరణకాలమునందు మమతజెందక సీతా
వరుని ధ్యానించుటకు స్థిరమైనమతి గల్గి
శరణుశర ణటంచును శ్రీరాముని చర్చలెల్ల వినుచును
ధరలోపలను తూము నరసింహదాసుని
అరసి ప్రోచెడు రఘువరుని నామది నిల్పి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raamaraama yaMdunoo appuDu vaTTi paamaramuna nuMdunoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )