కీర్తనలు తూము నరసింహదాసు రామరామ యంటే నీ సొమ్మిక యేమి తక్కునౌనే
కల్యాణి - ఆది
పల్లవి:
రామరామ యంటే నీ సొమ్మిక యేమి తక్కునౌనే
కామితార్థ ఫలదాయక రఘుకులసోముని తారకనాముని రాముని
చరణము(లు):
కూరగాయమాటలు వదరెదవు కూటికైన రావు
గోరుకొలది శ్రీనారాయణ యని సారెసారెకును చాటిపలుకుచు
గాసిచెంది తిరిగినఫల మించుక గానవైతివికను
వాసిగ భద్రగిరీశుని మనమున దలచుచు నరసింహదాసుని గనుగొని
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raamaraama yaMTee nii sommika yeemi takkunaunee - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )