కీర్తనలు తూము నరసింహదాసు పాహి శ్రీరఘునాయకా భక్తజనపాల నను బాయకా పాహి శ్రీరఘువీర
కల్యాణ - త్రిపుట
పల్లవి:
పాహి శ్రీరఘునాయకా భక్తజనపాల నను బాయకా పాహి శ్రీరఘువీర
పరమదయాకర పాహి జనోద్ధార దైత్యవిదూర మాం
చరణము(లు):
వారివాహశరీరా వనరుహమిత్ర వంశపావనాకార
పారావారగంభీర క్షీరాంభోధివిహారాపాలిత పాండవ పరమోదార
సూరిజనమందారా రణజయశూర మౌక్తికహార వరసుకు
మార శ్రీరఘువీరమంధరధీర మౌనిమనోవిహారా
వరదాశ్రిత పాలనా - శ్రీలక్ష్మీ నరసింహదాసావన
అరిదరశార్ఙ్గ నందక గదాయుధధర వరగరుడ కేతన లసత్కనకాంబరధర -
పురహర ప్రముఖాభివందిత పుండరీక నయన శ్రీధర -
నిరతిశయ గోవింద మాధవ నిఖిలలోకానంద భవహర ప్రాహి శ్రీరఘు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - paahi shriiraghunaayakaa bhaktajanapaala nanu baayakaa paahi shriiraghuviira - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )