| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 31. ఉస్సురనెదవు | |
|
ఓసి కూలిదానా! అరుణోదయాన మంటి తట్ట నెత్తిన బెట్టి మరుగులేని యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ? | |
|
అంబర చుంబి సౌధముల కాయువు పోసెడి నీ శ్రమ ప్రభా వంబు నెరుంగలేని ధన వంతుల బంగరు పళ్ళెరాలలో అంబలి పోసి త్రాగు సమ యంబులు డగ్గరె లెమ్ము! నీ నవా స్యంబున రుద్రనేత్ర విల యాగ్నుల కుంకుమబొట్టు పెట్టుమా! | |
|
వ్రాసి వ్రాసి పొత్తములు మాసి నా క లమ్ములో సిరా యింకి, రక్తమ్ము పోసి అరుణ తరుణాక్షరాల పద్యాలుకూర్చి ఆకలికి మాడిపోయెద నీకొఱకయి. | |
| (చార్మినారు వద్ద రాతి కట్టడాల నిర్మాణ సమయమున) | |