| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
38. నీడ |
| 38. నీడ |
|
అందాలు తానె చూచింది నీటిలో చందాలు తానె చెప్పింది నాతోటి ఒడ్డున్న మందార వంగి బొట్టెట్టుకొని అందాలు తానె చూచింది సొగసెల్ల చూచేను సొమ్మసిలి పోయేను చెట్లంటి పాములే చెరువెల్ల పాకేయి అందాలు తానె చూసింది ఆ వింతలన్ని చూచింది అప్పుడే ఆకాశ మడలిపోయింది గజగజా వణకి తా గట్లపై కొరిగింది సూర్యుడే చెట్టెక్కి చూడ భయపడ్డాడు అందాలు తానె చూచింది జుట్టెల్ల విరియ బోసింది మందార బొట్టిట్టె చెదరి రాలింది గట్లగుండెలు కలగమెట్ల కన్నులుచెదర వంగున్న మందార వంగియే యుండి ఆ అందాలు తానె చూచింది నాతోటి మందార మాటలాడింది. |