| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
ఊరవతల |
| ఊరవతల (భారతి - జూలై 1941) |
|
కలల పొదరిళ్ళల్లో సౌఖ్యంపు నిదురలో కనిపించి ఒక తన్వి మేనక నా పేరు మేఘాలకు వెనుక ప్రక్క మా ఊరని మాయమయ్యె |
|
చిరునామా తెలిసికూడ చేసేదేమీ లేక ఊహాగానం శాయగ ఊరవతల కెళ్ళాను, * * * కావు! కావు! ఆకాశం కాకిపిల్ల నోరు తెరచె మేతకొరకు |
|
పాపిష్టి ఇనోదయమె పాముకాటు ఎండపొడిచె భువికి తగిలె శివజ్వరం! |
|
ఫలములు లేనేలేవు పచ్చనకూడా చచ్చి నీడకూడ ఈయలేని మ్రోడుచెట్ల జంటపొత్తు! |
|
'ఇనుపసరుకు' ఎనుపోతు యము నెక్కడో దింపేసి తనుమాత్రం ఎదురాయెను! |
|
ప్రేతలతో ఇల్లట్టుల బూరుగ వృక్షంమీద కళ్ళజోడు పెట్టుకున్న గరుడ పురాణ బ్రాహ్మడు కంఠమెత్తె ఘూకమ్ము! |
|
కాటకంపు తాటకిలా ఆరుబయట మిల్లు విశ్వకర్త హృదయంలో దుస్వప్నంలా భుగ భుగ మను పొగగొట్టం ఆకాశమె చిల్లులువడ అతితారస్థాయి నా మిల్లరచింది! |
|
పోలీసుల ఈలకు నిశిరాతిరి పసిపిల్లడు కలత నిదుర కళవళ పడ్డట్టు కణకణ మండే కళ్ళతో కార్మిక సోదరు డదరెను! |
|
జీవనమ్మె తీసినారు జలమంతా మిల్లుకెత్త పాడలేని గులకరాళ్ళ పాతవడ్డ సెలయేరు మురికిబట్ట లెన్నొమోసి రజకునిచే రట్టు! |
|
పురమంతా రాతిరంత తిరగడం కాగితాల భోజనం పోయిన ఆ యేటినవ్వె పుక్కిట నెమరేసుకుంటు గండశిల నీడలోన కనుమోడ్చెను గార్దభస్వామి!!! |
|
శిలకెంతొ దగ్గరగా గొప్పవారి చూపుల్లా గుచ్చుకొనె యీతచెట్టు! అవిశ్వాసంపు బ్రతుకు అర ఘడియైనను నోర్వదు పోయిన ఆ పూర్వపు యజమాని పోతిరాజు ఎముకలతో చెలగాటం సాగించి శ్మశానాల తిరిగివచ్చు శునక సందడి! |
| 'అల్బిదా! అల్బిదా!' |
|
తురకల పండుగలోన ఊరేగే పీరుల్లా ఏతచేత గీతవడ్డ తాటివనం! |
|
బ్రహ్మచెముడు కంచెమధ్య పూర్ణిమ సంధ్యల్లోన ఘడియైనా ఉదయాద్రిని రుధిరజ్యోతై వెలిగే జాబిల్లి! |
|
మృతశరీర ఆక్రమణ ఘటాకాశ అరుణారుణ రక్త సిక్త- మోముతోడ 'మా అమ్మె చంపింది! మా అమ్మె చంపింద'ను మౌనముగ గాజుకళ్ళ పురిటిపిల్ల! |
|
వెనుతిరిగె చూచాను వెంటాడె మృత్యువులా వెరపు గొలిపె నా ఛాయ! |
|
అసురులతో పోరాటం మిషెన్ గన్నులారాటం జీవహింస కూడదని చేతచిక్కినారు!! |
|
భూమికంత ఈనాడే గ్రామదేవతోత్సవమ్ము కాలజ్ఞానులు మీరు 'కాచుకోండి కత్తిపదును కాచుకోండి కవిగార'ని గాలి కబురు చెప్పింది! |