| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
అతను : నేను |
| అతను : నేను |
|
అతను చెడి బ్రతికే బ్రతుకు నా బ్రతికి చెడ్డ చావు! |
|
మగవానికి మగువ లాగు అనుభవానికి తనకాయం! |
|
ముసలి మొగుడు ఒళ్ళు పడుచుభార్య హృదయం నే పడలేని బాధ |
|
ఎలుకలు లక్ష్మీప్రదమని అతను ఇల్లు కాల్చుకొన్న నేను! |
|
దిగి లోతులు తెలుసుకున్న అతను తినకుండా రుచులడిగే నేను |
|
కాపురాని కాడదై కంచంలో మెతుకు పెడితె ఊర్వశిలా చూచుకొని ఉవ్విళ్ళూరే అతను |
|
రంభైతే నేమి రసికత చాలని భార్యని విస విసలాడే నేను. |
|
అతగాడితో మనకేల నామాటె చెబుతాను ఊర్ధ్వకాయం అధోముఖం ఆహారానికి భూమి విహారానికి విహాయసం రవి గాంచని కోడిపిల్ల నీ కళ్ళకు ఆడపిల్ల! దొరికిందా- గ్రద్దను! దొరకదూ? కవిని!! |