| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
కుష్ఠురోగి పాట పాడె |
| కుష్ఠురోగి పాట పాడె |
|
రోడ్డు దరిని బండమీద కుష్ఠురోగి పాట పాడె |
|
"దినప్రభుడు దివంగతుడైతే దిక్కుల పిల్లలు రోదిస్తే మరిపించేందుకు ఆకాశం అత్తయ్య కాశీ మజిలీల దేవతావస్త్రాల కథ చెప్పేందుకు ప్రారంభించిన కాలం |
|
భగవంతుని నిదురలోన బంగారపు స్వప్నాలు కనువిచ్చి తెలివొచ్చి తలుచుకుంటే బండశిలలు |
|
లోకానికి శిలవు నాకు మాత్రం వలపుల రాణివి నిను నిమిరేందుకు వేళ్ళయినా లేవె! |
|
సూక్ష్మంలో శాపం సుందరతమమె స్థూలంగా భూమ్మీంచి బుగ్గిలోంచి నీకోసం చూస్తే నాకోసం నీవే వస్తే నా శాపంలోనైనా నీ కౌగిట్లో ఉందామని నీవే గుర్తించేందుకు నా వేయికళ్ళ గాయాలతో నే వస్తే వేల్పని గుర్తించని వెఱ్ఱిలోకం! |
|
రోడ్డు దరిని బండమీద కుష్ఠురోగి అనుకుంటే నీకొక లెక్కా? |