| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
తెనుగురాత్రి |
| తెనుగురాత్రి (భారతి - డిసెంబరు 1941) |
|
శూన్యమ్మగు చూపులతో శుష్కించిన దేహముతో పేదవాని కడుపుమంట కాలి పేలిపోవు కోర్కె గగనమ్మున చుక్క |
|
శక్తి సన్నగిల్లిపోయి రక్తము విరిగిన గుర్విణి హస్తమునన్ చిటిలిపోవు శస్త్రమ్మటు బిలుకుమార్ప మాసిపోని గాజుముక్క నెలవంక సంఘం వంక! |
|
నోట మన్నె కొట్టు జగతి నోరు తెరువ పాలకొరకు బాలిక చూలాలి కిదుకుబిడ్డ తూలిపోవు అసువులే నీలాలగాలి వీస్తోంది |
|
తలకాలని తల్లిశవం! తండ్రి పెండ్లికై తహతహ! కడవడు నీళ్ళకు నేడ్చే గంపెడు పిల్లల దుఃఖపు కంటివాన మిన్నంటి కురియు మంచుసోన! |
|
పసితనమున పెండ్లి భర్త పరమపదము జేర విధవ మసక మసక యౌవనమున కుసుమించే తల్లితలపు గుండెల్లో పాలపాట ఆకాశపు పాలబాట! |
|
ఆంధ్ర యువక జీవనార్చి కాలిన మేడలనుంచి ఆరిన వాడలనుంచి ధూమమ్మెగజిమ్మే చీకటి దుమ్ము రేగు తెనుగురాత్రి!!! |