| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
వీధి పాటకులు |
| వీధి పాటకులు (భారతి - ఏప్రిల్ 1942) |
|
క్రోటన్ కొమ్మ కుష్ఠురోగి మచ్చలతో గాయాలతో బిచ్చగాడు |
|
గ్రుడ్డిది ప్రేమలాగు చీకటి మ్రాను ముష్టిముండ |
|
దరిద్రాన్ని మరచేందుకు కాకిలాంటి కాలాన్నే తరిమేందుకు కవి! * * * చీకటికే పుడితేనేమి రోగాలే కంటేనేమి కడుపుతీపి చెడ్డది! పుట్టారిద్దరు వత్సలు ముళ్ళపూలు మునిగోరింట జంటలు |
|
ఊరవతల మట్టినేల మర్రిచెట్టు నీడలోన బ్రహ్మజ్ఞాని బ్రహ్మచెముడు బాలసారె చేసింది 'పోతిగాడు!' 'అసిరిగాడు!' ఇరుగు పొరుగు ఉన్నారా విన్నారా పేపరులో పడ్డాదా? 'ప్రతిభ'కు పద్యాలా? భూమి కన్న సంతానాన్ని దీవించింది * * * ప్రకృతి పెట్టిన వేసవి గానపాఠశాల తుమ్మెద తంబురశ్రుతి కోయిల ఒజ్జ శాపంలో కుశలవులు వాల్మీకం శంకరాభరణం! * * * రోడ్డుదరి హాలు గుమిగూడిన ప్రజ శ్రమనివారణ పాట ఉదయభాను కరముల ఉయ్యాల లూగి మెరసిపడే చంటిపిల్ల ధూళిలాగు ఆకలితో కాలి పేలిపోవు కంఠద్వయి పాట! * * * గాన పాఠశాలలో చదువుకున్న ఎద్దు సత్తరవులో పద్దు వచ్చా డొకడు ప్రజ మధ్యకు విద్వాంసుని కచ్చగట్టి భైరవికి ఆనంద భైరవికి వ్యత్యాసం చెపితే వేలకు వేలిస్తానని! |
|
నవ్వుకుంటు పిల్లలు గువ్వజంటలాగు విద్వాంసులు 'సంధ్యలో భైరవి ప్రస్తావిస్తే వెన్నెల దూరేవేళకు ఆనందభైరవి అవుతుంద'ని నుడివారు!! |